వాలీబాల్ ప్లేయర్‌పై కోచ్ అత్యాచారం

హర్యానా : హర్యానాలోని రివారీ గ్రామంలో దారుణం జరిగింది. ఓ వాలీబాల్ ప్లేయర్‌పై గత రెండున్నరేండ్ల నుంచి ఆమె కోచ్ అత్యాచారం చేస్తున్నాడు. ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను హెచ్చరించడంతో వాలీబాల్ ప్లేయర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్గావ్, రోహతక్‌తో పాటు పలు ప్రాంతాల్లోకి కోచ్ తనను తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. కోచ్ గౌరవ్ దేశ్వాల్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే కోచ్‌ను పోలీసులు అరెస్టు చేయలేదు. విచారణ పూర్తి అయిన తర్వాత కోచ్‌ను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. గతేడాది ఢిల్లీలో నరేశ్ దాహియా అనే రెజ్లర్.. జూనియర్ నేషనల్ లెవల్ కబడ్డీ ప్లేయర్‌పై అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే.

Related Stories: