ఎంపీపీ, జడ్పీటీసీలకు అధికారాలు కల్పిస్తాం : మంత్రి ఎర్రబెల్లి

కరీంనగర్ : కరీంనగర్ ఉమ్మడి జడ్పీ చివరి సర్వసభ్య సమావేశం ఇవాళ జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరయ్యారు. జిల్లా కేంద్రంలో జడ్పీ కొత్త భవనంతో పాటు డీపీఆర్‌సీ భవనాన్ని మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. కేంద్ర చట్టం వల్ల గత ఐదేళ్లలో నిధులు లేక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు నిధులు, విధులు కల్పించేందుకు చట్టాలు కల్పిస్తున్నాం. గ్రామపంచాయతీ, ఎంపీపీలకు అధికారాలు కల్పించబోతున్నాం. సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇవ్వడం ఇబ్బందేమి కాదు. అసెంబ్లీలో ఒక చట్టం రూపొందించాలన్నదే సీఎం కేసీఆర్ ప్రధాన ఉద్దేశం. ఎంపీపీ, జడ్పీటీసీలకు అధికారాలు కల్పిస్తామన్నారు. స్పందించకపోతే వారిపై కూడా చర్య తీసుకునే విధంగా చట్టం మారుస్తున్నామని తెలిపారు. మిషన్ భగీరథకు ఏటా రూ. 2 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని చెప్పారు. రోడ్డ మరమ్మతు కోసం నిధులు, అధికారాలు సర్పంచులకు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. ఐకేపీ నిధులు త్వరలోనే విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేయబోతున్నాం అని ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.

Related Stories: