ఖమ్మం జిల్లాలో అన్ని సీట్లు టీఆర్‌ఎస్ గెలుస్తుంది: తుమ్మల

ఖమ్మం: సత్తుపల్లిలో టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... 35 ఏళ్లుగా సత్తుపల్లి ప్రజల కష్టసుఖాల్లో మమేకమయ్యాం. రూ.10వేల కోట్లతో సీతారామ ప్రాజెక్టు పనులు చేస్తున్నాం. కరువు మండలమైన వేంసూర్ పచ్చగా ఉందంటే సీఎం కేసీఆర్ చలువే. జిల్లాలోని అన్ని సీట్లలో టీఆర్‌ఎస్‌ను గెలుచుకుందాం. ప్రతి కార్యకర్త కేసీఆర్‌లా మారి సత్తుపల్లిలో పిడమర్తి రవిని గెలిపించాలి. తుమ్మల వచ్చే మంత్రి వర్గంలో ఉండాలని మీరు భావిస్తే సత్తుపల్లిలో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలి. సత్తుపల్లిలో పిడమర్తి రవి గెలవకుంటే వచ్చే క్యాబినెట్‌లో తుమ్మల ఉండడని తెలిపారు.

Related Stories: