సామాన్యులు కుటుంబసభ్యులతో సినిమాకు వెళ్లే పరిస్థితి లేదు: తలసాని

హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సచివాలయంలోని తన చాంబర్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ సినిమా టికెటింగ్ విధానం అమలు అంశంపై అధికారులతో సమీక్షించారు. థియేటర్లలో ఇష్టానుసారం టికెట్లు విక్రయిస్తున్నారన్న మంత్రి.. సామాన్యులు కుటుంబసభ్యులతో కలిసి సినిమాకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. కొన్ని ప్రైవేట్ వెబ్‌సైట్లు రూ. 20 నుంచి రూ. 40 సేవారుసుం వసూలు చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా టికెట్లు విక్రయిస్తున్నారు. థియేటర్లలో తినుబండారాలకూ అధిక ధరలు వసూలు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించే థియేటర్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆన్‌లైన్ టికెటింగ్‌లో న్యాయపర అడ్డంకులు తొలిగేలా చర్యలు చేపట్టాలి. ఆన్‌లైన్ టికెట్ విధానం వల్ల ప్రజలపై భారం పడకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Related Stories: