యువత ఉపాధి కోసం సబ్సిడీపై రుణాలిస్తున్నాం : పోచారం

నిజామాబాద్: బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండల కేంద్రంలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా రజక, గొల్ల-కురుమ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి పోచారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం సమక్షంలో రజక, గొల్ల-కురుమ సంఘాలు టీఆర్ఎస్ కే ఓటు వేస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. ఆ తీర్మానం ప్రతిని సంఘాల ప్రతినిధులు మంత్రికి అందజేశారు.

అనంతరం పోచారం మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ప్రజల కడుపు కొడితే..టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కడుపు నింపుతోందన్నారు.

అభివృద్ధి పనులతో పాటు అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. అందుకే, ప్రజలు గ్రామాలకు గ్రామాలు టీఆర్ఎస్ కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్లలోనే గతంలో ఎప్పుడూ లేనన్ని అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. నిరుద్యోగ రజక యువతకు ఉపాధి కోసం సబ్సిడీతో లక్ష రూపాయల రుణం, దోబీఘాట్ల నిర్మాణం, పరికరాలు పంపిణీ చేస్తున్నామన్నారు. గొల్ల-కురుమలకు గొర్రెలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. బీసీల ఉపాధి కోసం సబ్సిడీపై రుణాలు ఇస్తున్నామని మంత్రి వివరించారు.

Related Stories: