పులిహోర వడ్డించిన మంత్రి మహేందర్ రెడ్డి

హైదరాబాద్: కొంగరకలాన్ గులాబీమయం అయింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రగతి నివేదన సభకు తండోపతండాలుగా ప్రజలు తరలివస్తున్నారు. ఇప్పటికే చాలామంది సభకు చేరుకున్నారు. మిగితా వారు వాహనాల్లో సభకు బయలుదేరారు. దూర ప్రాంతాల నుంచి సభకు వచ్చిన ప్రజలకు మంత్రి మహేందర్ రెడ్డి పులిహోర వడ్డించారు. సభ వద్ద ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.

Related Stories: