ప్రత్యేక హోదా కోసం అనకాపల్లి ఎంపీ నిరహారదీక్ష

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: విభజన హామీ చట్టంలోని అంశాలు, ఏపీకి ప్రత్యేక హోదా కేటాయించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం జిల్లా అనకాపల్లి టీడీపీ ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంగళవారం నిరాహారదీక్ష చేపట్టారు. తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోకుండా అనకాపల్లిలోని నెహ్రూ చౌక్ సెంటర్ వద్ద దీక్షకు దిగారు.