మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డితో మంత్రి కేటీఆర్ భేటీ

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డితో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఇవాళ ఉదయం సురేశ్ రెడ్డి నివాసానికి కేటీఆర్ వెళ్లి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సురేశ్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం. బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సురేశ్ రెడ్డి. 2004-09 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సురేశ్ రెడ్డి స్పీకర్‌గా సేవలందించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి స్పీకర్ పని చేసిన మొదటి వ్యక్తి సురేశ్ రెడ్డే. 1984లో మండల స్థాయి లీడర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సురేశ్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
× RELATED టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగానే ఉంటది..