ఉత్తమ్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. సీఎం కేసీఆర్ కొడుకుగానే కాకుండా.. ఆయనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆయన మంచి వాగ్దాటి. సోషల్ అవేర్‌నెస్‌లో, మిగితా విషయాల్లో యూనిక్‌గా ఉంటారు కేటీఆర్. ఇంతవరకు ఏ నాయకుడు కూడా సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్‌గా ఉండి ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించలేదు. అది ఒక్క కేటీఆర్‌కే సాధ్యమయింది. తాజాగా.. ఆయన ట్విట్టర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి అదిరిపోయే పంచ్ ఇచ్చారు. ఉత్తమ కుమార్ రెడ్డి.. ఉత్త ముచ్చట్లు చాలా మాట్లాడుతాడు కదా. ఎన్నికల వేళ టీఆర్‌ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్‌పై, మంత్రి కేటీఆర్‌పై ఆయన తీవ్రంగా విరుచుకుపడుతున్నాడు. లేనిపోనివి కలిపి బదనాం చేస్తున్నాడు. ఇవాళ కూడా మంత్రి కేటీఆర్‌ను విమర్శిస్తూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌కు అంతే స్థాయిలో ఘాటుగా మంత్రి కేటీఆర్ రిప్లయి ఇచ్చారు. రాహుల్ గాంధీకి అన్ని పళ్లెంలో నుంచి వచ్చాయని... తాను 8 ఏళ్లు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తర్వాత మంత్రిని అయ్యానని మంత్రి అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అని చెప్పడం.. బ్రిటీషర్లు ఇండియాకు స్వాతంత్య్రం ఇచ్చారు.. అని చెప్పడంలా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు.

Related Stories: