తిరుమలలో మంత్రి కడియం శ్రీహరి

తిరుపతి: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడి దర్శనార్థం మంత్రి కడియం శ్రీహరి తిరుమలకు చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న మంత్రికి టీటీడీ రిసెప్షన్ డిప్యూటీ ఈవో బాలాజీ స్వాగతం పలికారు. మంత్రి కుటుంబ సభ్యులకు తిరుమల‌ పద్మావతినగర్ లో బస ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకోనున్నారు.
× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు