బోనమెత్తిన కడియం కావ్య

వరంగల్: తెలంగాణ సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బోనాల పండగ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండగను రాష్ట్ర పండగగా గుర్తించి ఘనంగా నిర్వహిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండగను ఎంతో భక్తి, శ్రద్ధలతో కుల, మతాలకు అతీతంగా జరుపుకుంటూ ప్రజలు మతసామరస్యాన్ని పాటించడం దీని ప్రత్యేకత. వడ్డేపల్లి పోచమ్మగుడి బోనాల సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కడియం కావ్య బోనమెత్తి తల్లికి మొక్కును చెల్లించారు. పోచమ్మ తల్లి తెలంగాణ ప్రజలను చల్లగా చూడాలని కోరుకున్నారు.
× RELATED నెగేటివ్ రోల్ లో వరుణ్ తేజ్..?