అభివృద్ధిని అడ్డుకునేందుకే మహాకూటమి

-మహాకూటమికి మహావైఫల్యం తప్పదు -పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై అమరావతి కేంద్రంగా కుట్ర: మంత్రి జూపల్లి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉద్యమ సమయంలో కలువని నేతలు ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా మహాకూటమిగా ఏర్పడుతున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. తెలంగాణకు అభివృద్ధి ఫలాలు అందిస్తున్న సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. మహాకూటమి మహావైఫల్యం చెందుతుందని జోస్యం చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి నాలుగున్నరేండ్లలో తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును చేపడుతుంటే దాన్ని అడ్డుకునేందుకు ఏపీలోని అమరావతి కేంద్రంగా కుట్ర చేశారని మండిపడ్డారు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. కల్వకుర్తి ప్రాంతానికి అ తి తక్కువ సమయంలో 37 వేల ఎకరాలకు కృష్ణాజలాలను పారించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కల్వకుర్తికి నీళ్లు ఇస్తామంటే వ్యతిరేకించార ని, అలాంటి పార్టీ నేతలను మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు.

కల్వకుర్తి ప్రా ంతంలో చివరి ఆయకట్టుకు నీళ్లందించేందుకు సీఎం కేసీఆర్ అదనంగా రూ.179 కోట్లను మంజూరుచేశారని, వచ్చే వానకాలం వరకుచివరి ఆయకట్టు కు నీరందిస్తామన్నారు. బెదిరింపులు, అడ్డదారుల చరిత్ర కాంగ్రెస్‌కే ఉన్నదని, 2014 ఎన్నికల్లో తనను బెదిరింపులకు గురిచేశారన్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నా రాయణరెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ హయాంలో అన్నివర్గాలకు సంక్షే మ పథకాలు అందుతున్నాయన్నారు. కల్వకుర్తి ప్రాంతంలో టీఆర్‌ఎస్‌దే విజయమన్నారు. ఈ సందర్భంగా కల్వకుర్తి అభ్యర్థి జైపాల్‌యాదవ్.. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.