రహీం పార్థీవ దేహానికి మంత్రి జగదీశ్‌రెడ్డి నివాళి

సూర్యపేట: జిల్లాలోని శాలిగౌరారం మండలం మందారం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్త రహీం నిన్న సభకు వస్తూ డీసీఎం పైనుంచి పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. రహీం పార్థీవ దేహానికి మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కిషోర్‌కుమార్, వేముల వీరేషం, గిడ్డంగుల చైర్మన్ మందుల సామెల్‌లు నివాలులర్పిచారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఉన్న మంత్రి అనంతరం మాట్లాడుతూ... మంచి ఉద్యమకారుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. రహీం కుటుంబ సభ్యులను ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.

Related Stories: