జర్నలిస్టు శిక్షణా తరగతుల గోడ పత్రిక ఆవిష్కరణ

నల్గొండ: జిల్లాలో ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న జర్నలిస్టుల శిక్షణా తరగతుల గోడ పత్రికను సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ కడవేరు సురేంద్ర మోహన్, డీపీఆర్‌వో ప్రసాద్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి జిల్లాల గొర్రెల పెంపకందారుల సంఘం చైర్మన్ పోలెబోయిన నర్సయ్య యాదవ్, హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, టీయూడబ్ల్యూజేహెచ్ 143 సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు వజ్జే వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Stories: