ఇంటర్ పరీక్షల ఫలితాలపై కమిటీ నియామకం

హైదరాబాద్: విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి జగదీష్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల అపోహలపై సమీక్ష జరిపారు. టీఎస్‌టీఎస్ ఎండీ వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలపై కమిటీ నియమించారు. మూడు రోజుల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫలితాల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు అని మంత్రి వివరించారు. ఫలితాల విషయంలో పొరపాట్లు జరిగినట్లు భావిస్తే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి పొరపాటు జరిగినా సరిదిద్దుతాం. కొంతమంది అధికారుల అంతర్గత తగాదాల వల్లే.. ఈ అపోహలు సృష్టించబడ్డాయి. ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
More in తాజా వార్తలు :