జోకర్లు, బ్రోకర్లను పార్టీలో చేర్చుకోం : మంత్రి జగదీశ్ రెడ్డి

నల్లగొండ : నల్లగొండలో జిల్లా పరిషత్ భవనాన్ని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఇవాళ ప్రారంభించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఉద్దేశించి మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. జోకర్లు, బ్రోకర్లను పార్టీలో చేర్చుకోమని స్పష్టం చేశారు. వారికి మానసిక స్థితి సరిగ్గా లేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇటువంటి వారు చేరాల్సింది టీఆర్‌ఎస్ పార్టీలో కాదు.. మానసిక వైద్యుడి దగ్గర అని చెప్పారు. రాహుల్ గాంధీ పర్యటనను రాష్ట్ర ప్రజలు పట్టించుకోరని తెలిపారు. విద్యార్థుల బలిదానాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఆదరణ లేదని మంత్రి తేల్చిచెప్పారు.

Related Stories: