హరికృష్ణ మృతిపట్ల మంత్రి జగదీశ్‌రెడ్డి సంతాపం

నల్లగొండ : సినీ నటుడు నందమూరి హరికృష్ణ మృతిపట్ల తెలంగాణ విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అన్నెపర్తి వద్ద హరికృష్ణ కారు ప్రమాదానికి గురయ్యాడని వార్త తెలవగానే.. మంత్రి జగదీశ్‌రెడ్డి అక్కడికి హుటాహుటిన వెళ్లారు. అటునుంచి కామినేని ఆస్పత్రికి చేరుకొని.. హరికృష్ణ పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అప్పటికే హరికృష్ణ మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. అమరావతి నుంచి నల్లగొండకు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబును దగ్గరుండి కామినేనికి తీసుకెళ్లారు మంత్రి జగదీశ్‌రెడ్డి. కామినేని ఆస్పత్రిలో హరికృష్ణ కుటుంబ సభ్యులను మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శించారు.
× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు