ఢిల్లీ బయల్దేరి వెళ్లిన ఆర్థికమంత్రి ఈటల

హైదరాబాద్: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో ఢిల్లీలో ఇవాళ జీఎస్టీ కౌన్సిల్ చివరి భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఈటల ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. సెప్టెంబర్ 2016న జీఎస్టీ కౌన్సిల్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 15 సార్లు కౌన్సిల్ భేటీ జరిగింది. ఇవాళ జరిగే సమావేశం చివరిది, 16 వది. కాగా పలు వర్గాల నుంచి వచ్చిన సూచనలు, అసంతృప్తులను దృష్టిలో ఉంచుకుని నేటి కౌన్సిల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

Related Stories: