హైదరాబాద్‌లలో 14.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండురోజులుగా చలి తీవ్రత పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణస్థాయి కంటే 2.2 డిగ్రీలు తగ్గి స్థిరంగా కొనసాగుతున్నాయి. అదే సమయంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే 2.2 డిగ్రీలు పెరుగడంతో ఎండతీవ్రత అధికంగా ఉంటున్నది. సాయంత్రం ఆరుగంటలకే చలి మొదలై.. రాత్రి సమయానికి తీవ్రంగా మారుతున్నది. బుధవారం ఉదయం 8.30 గంటల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రత 14.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Related Stories: