ఏడుగురు అభ్యర్థులను ప్రకటించిన ఎంఐఎం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వచ్చేఎన్నికల్లో ఎంఐఎం మరోమారు సిట్టింగ్‌లకే అవకాశం ఇచ్చింది. ఏడు స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం ప్రకటించారు. చాంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, యాకుత్‌పుర నుంచి సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రీ, చార్మినార్ నుంచి ముంతాజ్ అహ్మద్‌ఖాన్, బహదూర్‌పుర నుంచి మహ్మద్ మొజంఖాన్, మలక్‌పేట్ నుంచి అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, నాంపల్లి నుంచి జాఫర్ హుస్సేన్ మేరాజ్, కార్వాన్ నుంచి కౌసర్ మొయినుద్దీన్ బరిలోకి దిగుతున్నట్టు వెల్లడించారు. ముంతాజ్ అహ్మద్‌ఖాన్, అహ్మద్ పాషా ఖాద్రీల స్థానాలను పరస్పరం మార్చినట్టు చెప్పారు.