పంజాబ్ నిలకడగా..

పుణె: చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆరంభంలోనే వరుసగా వికెట్లు చేజార్చుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ప్రస్తుతం ఆచితూచి ఆడుతోంది. 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పంజాబ్‌ను మనోజ్ తివారీ(35), డేవిడ్ మిల్లర్(24) చక్కదిద్దే ప్రయత్నిం చేసినప్పటికీ భారీ భాగస్వామ్యం నెలకొల్పలేకపోయారు. ఈ దశలో క్రీజులో ఉన్న కరుణ్ నాయర్, అక్షర్ పటేల్ నిలకడగా ఆడుతూ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించేందుకు పోరాడుతున్నారు.

బుల్లెట్ లాంటి బంతులతో చెన్నై బౌలర్లు విరుచుకుపడుతున్నారు. టాప్ ఆర్డర్ పెవిలియన్ చేరిన నేపథ్యంలో ఇన్నింగ్స్ ముగిసే వరకు బ్యాటింగ్ చేయాలని వీరిద్దరూ పట్టుదలతో ఉన్నారు. 15 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 5 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. నాయర్(20), అక్షర్(4) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.

Related Stories: