దేశాన్ని వీడేముందు అరుణ్ జైట్లీని కలిశా

న్యూఢిల్లీ: దేశాన్ని విడిచివెళ్లే ముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసినట్లు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తెలిపాడు. మనీ లాండరింగ్, ఎస్‌బీఐ గ్రూపు బ్యాంకులకు రూ. 9 వేల కోట్లు ఎగవేసిన కేసులో విజయ్ మాల్యా బుధవారం లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరయ్యారు. అనంతరం మాల్యా మీడియాతో మాట్లాడారు. ఆర్థిక వ్యవహారాలను సెటిల్ చేసేందుకు ఆర్థికమంత్రిని కలిశానన్నారు. కాగా తన ప్రతిపాదనలకు బ్యాంకులు ఒప్పుకోలేదని పేర్కొన్నాడు. ఇవాళ వెస్ట్‌మిన్‌స్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు ఆయన అప్పగింత కేసులో హాజరయ్యారు. ఒకవేళ విజయ్ మాల్యాను అప్పగిస్తే ఆయన్ను ఏ జైలులో వేయాలో, దాని వీడియోను పంపాలంటూ గతంలో లండన్ కోర్టు కోరింది. ఆ నేపథ్యంలో భారత ప్రభుత్వం లండన్ కోర్టుకు ఓ వీడియోను కూడా పంపించింది. మాల్యాను ఉంచాలనుకుంటున్న జైలు వీడియోను ఇవాళ కోర్టు పరిశీలించనున్నది.

Related Stories: