మత్స్యకన్యలు ఉంటాయ్.. ప్రూఫ్ ఇదిగో..!

ఏంటీ.. మత్స్యకన్యలు ఉంటాయ్.. అనగానే షాక్‌కు గురయ్యారా.. ఏమీ లేదండీ..అదంతా ఉత్తిదే. మత్స్యకన్యలు నిజంగా ఉంటాయో, లేదో తెలియదు కానీ.. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా పోస్ట్ చేసిన ఆ ఫోటోను చూస్తే మాత్రం నిజంగా మత్స్య కన్యలు ఉంటే బాగుండును అనే అనిపిస్తుంది. మాల్దీవులలో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా అక్కడి బీచ్‌లో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. మత్స్యకన్యలు ఉంటాయ్.. అని కామెంట్ పెట్టింది. దీంతో ఇప్పుడా ఫొటో నెట్‌లో వైరల్ అవుతున్నది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఆ ఫొటోకు ఇప్పటికే దాదాపుగా 4 లక్షల లైక్‌లు వచ్చాయి. అనేక మంది సోనాక్షి సిన్హా కు చెందిన ఆ ఫొటోను షేర్ చేస్తున్నారు కూడా. ఇక సోనాక్షి సిన్హా ఇటీవలే అజయ్ దేవగన్‌తో కలిసి ముంగ్డా అనే పాటలో డ్యాన్స్ చేయగా, త్వరలో ఈమె కళంక్, దబాంగ్ 3 చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మధ్యే ఈమె నటించిన హ్యాపీ భాగ్ జాయేగీ రిటర్న్స్ సినిమా విడుదల కాగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది.

Related Stories: