మెయ్‌జు నుంచి 6టి స్మార్ట్‌ఫోన్

మొబైల్స్ తయారీదారు మెయ్‌జు తన నూతన స్మార్ట్‌ఫోన్ మెయ్‌జు 6టి ని చైనా మార్కెట్‌లో ఇవాళ విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.10,570, రూ.11,630 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది. ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

మెయ్‌జు 6టి ఫీచర్లు...

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.
× RELATED మరో పెళ్లి చేసుకున్నాడని మాజీ భార్య ఘాతుకం