నా పేరుతో విరాళాలు ఇవ్వొద్దు : మెహ‌రీన్

నాని నటించిన కృష్ణ గాడి వీరప్రేమ గాథ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన మెహరీన్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ మధ్య మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో మంచి విజయాలని అందుకున్న మెహరీన్ కేరాఫ్ సూర్య, జవాన్, పంతం చిత్రాల‌తో అప‌జ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది . ప్ర‌స్తుతం యంగ్ హీరో విజయ్ దేవరకొండ ద్విభాషా చిత్రం నోటాలోను కథానాయికగా నటిస్తుంది మెహరీన్. అంతేకాదు మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం ఎఫ్ 2లో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న జ‌త్టక‌ట్టింది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ భామ త‌న ట్విట్ట‌ర్‌లో త‌న పేరుతో విరాళాలు ఇవ్వొద్దని అబిమానుల‌ని కోరుతుంది.

ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కి కేర‌ళ రాష్ట్రం అతలాకుత‌లం అయిన సంగ‌తి తెలిసిందే. వ‌ర‌ద‌ల వ‌ల‌న నిరాశ్రయుల‌యిన వారికి సెల‌బ్రిటీలు విరాళాలు అందిస్తున్నారు. అభిమానులు కూడా త‌మ ఫేవ‌రేట్ స్టార్స్ పేరుతో విరాళాలు సేక‌రించి బాధితుల‌కి అంద‌జేస్తున్నారు. అయితే విజ‌య‌వాడ‌కి చెందిన మెహ‌రీన్ అభిమానులు కొంద‌రు ఆమె పేరుతో కేరళ రాష్ట్రంలోని వరద బాధితుల కోసం డబ్బు, ఫుడ్ ఇవ్వనున్నట్టు ట్విటర్ ద్వారా తెలిపారు. ఈ విష‌యంపై స్పందించిన మెహ‌రీన్‌.. అభిమానులంద‌రకి త‌న విన్న‌పాన్ని తెలియేసింది. మీ సేవాదృక్ప‌థాన్ని గౌర‌వించే నేను , నా పేరుతో ఎదుటి వారికి సాయం చేసేందుకు ఎవ‌రిని డ‌బ్బు అడ‌గొద్దు అని చెప్పింది. సాయం చేయ‌డం అనేది వారి ప‌ర్స‌న‌ల్ చాయిస్ కాని, నా పేరు మీద చేయోద్దు. టైం చూసి సాయం ఎవ‌రికి అవ‌స‌ర‌మో వారికి త‌ప్ప‌క సాయం చేస్తాను అని మెహ‌రీన్ తెలిపింది.

Related Stories: