మెహ‌రీన్‌ని ప‌ల‌క‌రిస్తున్న వ‌రుస ఆఫ‌ర్స్

నాని నటించిన కృష్ణ గాడి వీరప్రేమ గాథ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన మెహరీన్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ మధ్య మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో మంచి విజయాలని అందుకున్న మెహరీన్ కేరాఫ్ సూర్య, జవాన్, పంతం చిత్రాల‌తో అప‌జ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది . ప్ర‌స్తుతం యంగ్ హీరో విజయ్ దేవరకొండ ద్విభాషా చిత్రం నోటాలోను కథానాయికగా నటిస్తుంది మెహరీన్. అంతేకాదు మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం ఎఫ్ 2లో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న జ‌త్టక‌ట్టింది. పులి వాసి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రంలోను మెహ‌రీన్ క‌థానాయిక‌గా ఎంపికైంది. రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన్ సంస్థ నిర్మించ‌నున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్నాడు. ఇక తాజాగా మెహ‌రీన్ ఖాతాలో మరో ఆఫ‌ర్ చేరింది. బెల్లంకొండ శ్రీనివాస్ ఐద‌వ చిత్రంలో మెహ‌రీన్‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేశారు మేక‌ర్స్‌. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ మ‌రో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. నీల్ నితిన్ ముఖేష్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాని శ్రీనివాస్ తెర‌కెక్కించ‌నున్నాడు. వంశ‌ధార క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందించ‌నున్నాడు. చాప‌కింద నీరులా వరుస ఆఫ‌ర్స్ తో దూసుకెళుతున్న మెహ‌రీన్ రానున్న రోజుల‌లో స్టార్ స్టేట‌స్ అందుకుంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.

Related Stories: