సెలవు దినాల్లోనూ పౌరసేవా కేంద్రాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపు ద్వారా ఐదు శాతం రాయితీ పొందేందుకు వీలు కల్పించే ఎర్లీబర్డ్ ఆఫర్‌ను పన్ను చెల్లింపుదారులు ఎక్కువ సంఖ్యలో సద్వినియోగం చేసుకొనే వీలుగా ఈ నెలాఖరు వరకు ఆదివారాలతోపాటు ఇతర సెలవు దినాల్లో కూడా జీహెచ్‌ఎంసీ పౌరసేవా కేంద్రాలు తెరిచి ఉంచనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. అలాగే, వార్డు కార్యాలయాల్లో బిల్ కలెక్టర్లు అందుబాటులో ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులకు దేశాలు జారీచేసినట్లు తెలిపారు. పన్ను వసూళ్లను జోనల్ కమిషనర్లు పర్యవేక్షించాలని కోరారు. ఎక్కువమంది పన్ను చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్లను ఆయన ఆదేశించారు. గురువారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ దానకిశోర్ ఎర్లీబర్డ్ పథకం, పారిశుధ్య నిర్వహణ, ఇంటి అనుమతులు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎర్లీబర్డ్ పథకంలో ఈ ఏడాది రూ. 500కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గుర్తుచేశారు. ఖాళీజాగాల్లో వ్యర్థాలు వేస్తే జరిమానాలు ఖాళీ జాగాల్లో వ్యర్థాలు వేయడం ద్వారా వాటిని గార్బేజ్ పాయింట్లుగా మార్చుతున్నారని, అటువంటివారిని గుర్తించి జరిమానాలు విధించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఖాళీ జాగాల్లో చెత్త వేయకుండా సమీపంలో ఉండేవారిని చైతన్యపర్చాలని ఆయన కోరారు.

Related Stories: