అంబర్‌పేట్, ఉప్పల్‌లో ప్రత్యామ్నాయ రహదారులు!

హైదరాబాద్ : అంబర్‌పేట్, ఉప్పల్‌లో ఫ్లై ఓవర్ల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలను నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఇవాళ పరిశీలించారు. రామంతాపూర్ నుంచి ఉప్పల్ మెట్రోరైల్ డిపో వరకు 150 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేపడుతామని మేయర్ తెలిపారు. రామంతాపూర్ నుంచి మూసీ మీదుగా ఇమ్లిబన్ బస్టాండ్ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయితే దిల్‌సుఖ్‌నగర్, టీవీ టవర్ నుంచి వెళ్లే ట్రాఫిక్ మరింత సులువుగా వెళ్లే అవకాశం ఉందన్నారు బొంతు రామ్మోహన్. అంబర్‌పేట చౌరస్తా వద్ద రూ.186.71 కోట్లతో నిర్మించనున్న 1.465 కిలోమీటర్ల నిడివి గల నాలుగు వరుసల ఫ్లై ఓవర్‌కు ఈ ఏడాది మే నెలలో శంకుస్థాపన చేసిన విషయం విదితమే. ఉప్పల్ జంక్షన్ నుంచి వరంగల్ రహదారిలోని సీపీఆర్‌ఐ వరకు దాదాపు 6.25 కిలోమీటర్ల ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు.

Related Stories: