ఫైనల్లో మేరికోం..

సెమీస్‌లో నిఖత్ జరీన్‌పై విజయం mary గువాహటి: ఇండియన్ ఓపెన్ బాక్సింగ్ టోర్నీలో దిగ్గజ బాక్సర్ మేరికోం ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన 51కిలోల సెమీస్ బౌట్‌లో మేరి 4-1 తేడాతో తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌పై విజయం సాధించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన బౌట్‌లో తన ఆరాధ్య బాక్సర్ మేరికోంపై పైచేయి సాధించేందుకు కడదాకా ప్రయత్నించిన నిఖత్ పోరాడి ఓడింది. ఆదిలో జోరు కనబరిచినా నిఖత్ బౌట్ సాగిన కొద్ది తన పంచ్‌ల్లో వాడిని కొనసాగించలేకపోయింది. ఇదే అదునుగా తన అనుభవన్నంతా రంగరిస్తూ పుంజుకున్న మేరికోం..నిఖత్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ బౌట్‌లో విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగే ఫైనల్లో వాన్‌లాల్ దువాటి(మిజోరాం)తో ఈ మణిపూర్ స్టార్ బాక్సర్ తలపడుతుంది. పురుషుల వేర్వేరు విభాగాల్లో మొత్తం 17 మంది భారత బాక్సర్లు ఫైనల్లోకి ప్రవేశించారు. 51కిలోల విభాగం ఫైనల్లో సచిన్ సివాచ్...అమిత్ పంగల్‌తో తలపడుతాడు.