అరకు ఎమ్మెల్యే హత్య కేసులో మావోయిస్టుల పేర్లు వెల్లడి

విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సోర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను హత్య చేసిన మావోయిస్టుల పేర్లు పోలీసులు వెల్లడించారు. స్థానికుల నుంచి సేకరించిన సమాచారంతో ముగ్గురి పేర్లను విశాఖ పోలీసులు తెలిపారు. దాడిలో అరుణ అలియాస్ వెంకటరవి చైతన్య ఉన్నట్లు గుర్తించారు. ఈమె ఎస్‌జెడ్‌సీఎం దళంలో పనిచేస్తోంది. అరుణ స్వస్థలం విశాఖపట్నం జిల్లా కరకపాలెం వాసి. భీమవరం వాసి స్వరూప అలియాస్ కామేశ్వరి, జూలుమూరి శ్రీనుబాబు అలియాస్ సునిల్ పాల్గొన్నట్లు గుర్తించారు. శ్రీనుబాబు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా దుబ్బపాలెం మండలం అడ్డతీగల వాసిగా గుర్తించారు. దాడిలో పాల్గొన్నవారి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

Related Stories: