దళితుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు: జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్: దళితుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. జాతీయ చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్థతో ఎస్సీ కార్పొరేషన్ నేడు అవగాహన ఒప్పందం చేసుకుంది. మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. నిరుద్యోగ ఎస్సీ యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళితుల సమస్యల పరిష్కారాలపై సీఎం కేసీఆర్‌కు పూర్తి అవగాహన ఉందన్నారు. దళితుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అన్నింటికీ మూలమైన విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కొత్తగా 150 గురుకులాలు ప్రారంభించామన్నారు. భూ పంపిణీ పథకం కింద 10 వేల ఎకరాలకు పైగా ఇచ్చామన్నారు. స్వయం ఉపాధి పథకాల కోసం లక్ష మందికిపైగా సహాయం చేసినట్లు చెప్పారు. వెయ్యి మందికిపైగా యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు పొందేలా చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. 200 మంది దళిత యువతకు శిక్షణ ఇచ్చేందుకు నిమ్స్‌మేతో చేసుకున్న ఈ ఒప్పందంలో భాగంగా యానిమేషన్, డిజిటల్ ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ డిజైనింగ్ రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
× RELATED ఒంటిపై కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య