'ఫ‌స‌క్'యాప్ చూసి షాక్ అయిన మంచు వార‌బ్బాయి

డైలాగుల‌ని అవ‌లీల‌గా చెప్ప‌డంలో దిట్ట క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు అనే సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మాట‌ల్లో గాంభీర్యం, డైలాగులకు అనుగుణంగా హావభావాలు , యాక్టింగ్ లో అదరగొట్టడం మోహ‌న్ బాబు సొంతం. విల‌న్‌గా, నటుడిగా విభిన్న పాత్ర‌లు పోషించిన మోహ‌న్ బాబు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. తాను ‘ఇండియా టుడే’ టెలివిజన్‌కి ఇంట‌ర్వ్యూ ఇస్తూ త‌న డైలాగులపై త‌న దైన స్టైల్‌లో వివ‌ర‌ణ ఇచ్చాడు. ఈ క్ర‌మంలో ఎం.ధ‌ర్మ‌రాజు చిత్రంలోని ఓ డైలాగ్‌ను ఇంగ్లీష్‌లోకి త‌ర్జుమా చేసి చెబుతూ ‘ఫసక్‌’ అనే మాటను వాడారు. ఇప్పుడు ఆ మాట సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. నెటిజన్స్ త‌మ‌కి న‌చ్చిన స్టైల్‌లో మీమ్స్, స్పూఫ్స్, ఫ‌న్నీ వీడియోలు క్రియేట్ చేసి ర‌చ్చ చేస్తున్నారు. త‌న మాట‌కి ఇంత ఆద‌ర‌ణ ల‌భించ‌డం చూసి షాక్ అయిన మోహ‌న్ బాబు ఆనందం వ్య‌క్తం చేశారు. అయితే ఫ‌స‌క్ అనే పేరుతో ఇప్పుడు యాప్ రావ‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. ముఖ్యంగా మోహ‌న్ బాబు త‌న‌యుడు మంచు మ‌నోజ్ ఈ విష‌యం తెలుసుకొని ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. అప్పుడే యాప్ కూడానా అని ట్వీట్ చేశారు. మోహ‌న్ బాబు నోటి వెంట వ‌చ్చిన ఈ మాటకి ఇంత పాపులారిటీ ల‌భిస్తుంద‌ని ఆయ‌న కూడా ఊహించి ఉండ‌రేమో..!
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?