కంగనా ‘మణికర్ణిక’ షూటింగ్ లేనట్లేనా..?

ముంబై: బాలీవుడ్ ‘క్వీన్’ కంగనారనౌత్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం మణికర్ణిక..ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ. వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను మొదట క్రిష్ తీసుకున్నాడు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ తీస్తుండటంతో..బిజీ షెడ్యూల్ వల్ల మణికర్ణిక టీం నుంచి తప్పుకున్నాడు క్రిష్. ఆ తర్వాత మణికర్ణిక దర్శకత్వ బాధ్యతలను కంగనా చేపట్టింది. అయితే కంగనా స్టార్ హీరోయిన్అయినప్పటికీ..ఆమెకు దర్శకత్వ పఠిమ లేదని భావించిన నటుడు సోనూసూద్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చాడు.

తాజాగా చిత్ర నిర్మాత సంజయ్ కుట్టి కూడా మణికర్ణిక చిత్రం నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే వివిధ కారణాల వల్ల మణికర్ణిక షూటింగ్ వాయిదా పడుతూ వస్తుండటం వల్ల సినిమా బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువైందట. బడ్జెట్ అంతకంతకూ పెరుగుతుండటంతో నిర్మాతలెవరూ నష్టపోకూడదని భావించిన టీం సినిమా రద్దు చేయాలని ఫిక్స్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అర్థాంతరంగా నిలిచిపోతుందనే వార్త అభిమానులను ఒకింత నిరాశకు గురిచేస్తుంది. కొత్త నిర్మాతలు మణికర్ణిక సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకుంటారా..? మణికర్ణిక షూటింగ్ కొనసాగుతుందా..నిలిచిపోతుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.

Related Stories: