మ‌ణిర‌త్నం సెట్స్‌లో స్టార్స్‌..

స్టార్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం చివ‌రిగా చెలియా అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు మ‌ణిర‌త్నం. తమిళ్‌లో ‘చెక్కవంద వానమ్‌’ (ఎర్రని ఆకాశం తెలుగులో)అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతుండ‌గా, తెలుగులో ‘నవాబ్‌’ పేరుతో విడుద‌ల కానుంది . అర‌వింద్ స్వామి, విజ‌య్ సేతుప‌తి, శింబు, అరుణ్ విజ‌య్‌, జ్యోతిక‌, ఐశ్వ‌ర్య రాజేష్‌, అదితి రావు హైద‌రి, డ‌యానా ఎర‌ప్పా, ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రం రీసెంట్‌గా సెట్స్ పైకి వెళ్లింది. సీన్ గురించి శింబు, అదితి రావు హైద‌రితో మ‌ణిర‌త్నం డిస్క‌స్ చేస్తున్న ఫోటోలు కొన్ని బ‌య‌టికి వచ్చాయి. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రానికి డ‌బుల్ ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తుండ‌గా, సంతోష్ శివ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిత్రంలో ఇద్ద‌రు హీరోలు అన్న‌ద‌మ్ములుగా క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. మ‌ణిర‌త్నం- అర‌వింద్ స్వామి కాంబినేష‌న్‌లో వచ్చిన రోజా, ద‌ళ‌ప‌తి, బొంబాయి మరియు కాద‌ల్ వంటి హిట్ చిత్రాలు సూపర్ హిట్ కావ‌డంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక విజ‌య్ సేతుప‌తి, శింబుల‌తో ప‌నిచేయ‌డం మ‌ణిర‌త్నంకిదే తొలిసారి.

Related Stories: