మ‌ణిర‌త్నం మ‌ల్టీస్టారర్ సినిమాకి టైం ఫిక్స్

మరపురాని మేలిమి ముత్యాల్లాంటి సినిమాల్ని తీస్తున్న‌ దర్శకుడు మణిరత్నం. ఎన్నో ఆణిముత్యాలు ఆయన దర్శకత్వంలో వచ్చాయి. రీసెంట్‌గా చెలియా సినిమాని తెర‌కెక్కించిన మ‌ణిర‌త్నం త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌గా ఓ మ‌ల్టీస్టార‌ర్‌ని ప్లాన్ చేశాడు. అర‌వింద్ స్వామి, విజ‌య్ సేతుప‌తి, శింబు, ఫాహ‌ద్ ఫాజిల్ ప్ర‌ధాన పాత్ర‌లుగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్న‌ట్టు చిత్ర యూనిట్ కొద్ది సేప‌టి క్రితం ప్ర‌క‌టించింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో జ్యోతిక‌, ఐశ్వ‌ర్య రాజేష్‌లు కూడా కీల‌క పాత్ర‌లు చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇక సంగీతం విష‌యానికి వ‌స్తే డ‌బుల్ ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్‌ని సంగీత ద‌ర్శ‌కుడిగా తీసుకోవాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్టు టాక్. మ‌ణిర‌త్నం- అర‌వింద్ స్వామి కాంబినేష‌న్‌లో వచ్చిన రోజా, ద‌ళ‌ప‌తి, బొంబాయి మరియు కాద‌ల్ వంటి హిట్ చిత్రాలు సూపర్ హిట్ కావ‌డంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక విజ‌య్ సేతుప‌తి, శింబు, ఫాహ‌ద్ ఫాజిల్‌ల‌తో ప‌నిచేయ‌డం మ‌ణిర‌త్నంకిదే తొలిసారి. సంతోష్ శివ‌న్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేయ‌నుండ‌గా, మిగ‌తా కాస్ట్ అండ్ క్రూని ఎంపిక చేసి త్వ‌ర‌లోనే ఎనౌన్స్ చేయ‌నున్నారు. నేచుర‌ల్ స్టార్ నాని కూడా మ‌ణిర‌త్నం మల్టీ స్టార‌ర్ లో న‌టించ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. మ‌రి దీనిపై క్లారిటీ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.
× RELATED నామినేషన్ల చివరి రోజు కూటమి పార్టీలకు కాంగ్రెస్ షాక్