మ‌ణిరత్నంని స‌త్క‌రించిన మ‌హారాష్ట్ర సీఎం, గ‌వ‌ర్న‌ర్‌

దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుల‌లో మ‌ణిర‌త్నం ఒక‌రు. మేలిమి ముత్యాల్లాంటి సినిమాల‌ని తీసిన మ‌ణిర‌త్నంని బెంగ‌ళూర్ ఫిలిం ఫెస్టివ‌ల్‌(బిఐఎఫ్ఎఫ్‌)లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో స‌త్క‌రించారు. మ‌హారాష్ట్ర గ‌వ‌ర్నర్‌తో పాటు ఆ రాష్ట్ర సీఎం చేతుల మీదుగా మ‌ణిర‌త్నం ఈ అవార్డు అందుకున్నారు. నిన్న సాయంత్రం 5గం.ల‌కి విదాన‌సౌద‌లో జ‌రిగిన ఈవెంట్‌లో మ‌ణిరత్నంకి ప‌ది ల‌క్ష‌ల న‌గ‌దు, ప్ర‌శంసా ప‌త్రంతో పాటు మోమెంటోని అందించారు. సినీ ప‌రిశ్ర‌మ‌కి అందించిన సేవ‌ల‌కి గాను ఓ ఫిలింమేక‌ర్‌కి బిఐఎఫ్ఎఫ్.. అవార్డు అందించ‌డం ఇదే తొలిసారి. 13మంది స‌భ్యులు గ‌ల క‌మిటీ మ‌ణిర‌త్నం పేరుని ఎంపిక చేసింది. మ‌ణిర‌త్నంతో పాటు ప‌లువురు ప్ర‌ముఖ‌లు వివిధ విబాగాల‌లో అవార్డులు అందుకున్నారు. క‌న్న‌డ చిత్రం ప‌ల్ల‌వి అనుప‌ల్ల‌వితో డెబ్యూ ఇచ్చిన మ‌ణిశ‌ర్మ సౌత్ ప‌రిశ్ర‌మ గ‌ర్వించ‌ద‌గ్గ సినిమాలు చేశాడు. కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే కాకుండా స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే అత్య‌ద్భుత‌మైన సినిమాలు తెర‌కెక్కించాడు. న‌య‌గ‌న్‌, బొంబాయి, ఇరువ‌ర్ త‌దిత‌ర చిత్రాలు రియ‌ల్ ఇన్సిడెంట్స్‌కి ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి. ద‌ళ‌ప‌తి, రావ‌న్ చిత్రాలు ఇండియ‌న్ ఎపిక్స్ ఆధారంగా తెర‌కెక్కించారు. ప్ర‌స్తుతం ఓ మ‌ల్టీ స్టార‌ర్ ప్లాన్ చేస్తున్నాడు మ‌ణిర‌త్నం. న‌వాబ్ అనే టైటిల్‌తో రూపొంద‌నున్న ఈ చిత్రంలో అర‌వింద్ స్వామి, విజ‌య్ సేతుప‌తి, శింబు, అరుణ్ విజ‌య్‌, జ్యోతిక‌, ఐశ్వ‌ర్య రాజేష్‌, అదితి రావు హైద‌రి, డ‌యానా ఎర‌ప్పా, ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి డ‌బుల్ ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించ‌నున్నాడు.

Related Stories: