మంద్‌సౌర్ బాలిక రేప్‌కేసు.. ఇద్దరికి ఉరిశిక్ష

సంచలనం సృష్టించిన మంద్‌సౌర్ ఏడేండ్ల బాలిక రేప్‌కేసు నిందితులకు స్థానిక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఘటన జరిగిన రెండునెలల లోపే శిక్షలు ఖరారు కావడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో గత జూన్ 24న ఓ ప్రైవేటు స్కూల్ గేటు దగ్గర తన నానమ్మ కోసం ఎదురు చూస్తున్న బాలికను దుండగులు అపహరించారు. పొదల్లోకి తీసుకుపోయి ఆ చిన్నారిపై లైంగికదాడి జరిపారు. తర్వాత చనిపోతుందనుకుని వదిలేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు మగతగా నడుచుకుంటూ వెళ్తున్న పాపను ఓ వ్యక్తి చూసి తల్లిదండ్రులకు అప్పగించారు.

వంటినిండా గాయాలతో ఉన్న ఆమెను దవాఖానాలో చేర్చి చికిత్స అందించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇర్ఫాన్ (20), ఆసిఫ్ (24)లను పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారించిన రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి నిషా గుప్తా నిందితులు ఇద్దరికీ ఉరిశిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. నిందితులను పోలీసు వాహనంలో కోర్టుకు తీసుకువెళ్తుండగా స్థానిక బీజేపీ నేత వినయ్ దుబేలా వారిపై చేయిచేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతున్నది. కేసు ప్రాముఖ్యం దృష్ట్యా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ చూపింది.

× RELATED నెగేటివ్ రోల్ లో వరుణ్ తేజ్..?