గంగులకు అభినందనల వెల్లువ

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. పెద్ద సం ఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకులు కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభా కాంక్షలు తెలిపారు. వివిధ శాఖల అధికారులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి అభినంద నలు తెలిపారు. గంగుల ఉదయం నగరంలోని వివిధ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనం తరం నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు.. నగరంలోని శివాలయం, మార్కెట్‌లోని వేంకటేశ్వర స్వామి, వరహస్వామి, మంచిర్యాల చౌరస్తాలోని ప్రసన్నాంజనేయ ఆలయాల్లో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. పండితులు ఆశీర్వాదం అందించారు. చైర్మన్లు ఘనంగా సన్మానించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు.. ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లో మంత్రి గంగులను కలెక్టర్‌ సర్పరాజ్‌ అహ్మద్‌, సీపీ కమలాసన్‌రెడ్డి, జేసీ శ్యాంప్రసాద్‌లాల్‌, ఆర్డీఓ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ, పౌరసరఫరాల శాఖ, ఆర్‌ అండ్‌ బీ, రెవె న్యూ అధికారులు కలిసి పుష్పగుచ్ఛాలు అందిం చారు. జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ, చొప్పదండి ఎ మ్మెల్యే సుంకె రవిశంకర్‌, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, నగర కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి, కొత్తపల్లి కమిషనర్‌ స్వరూపరాణి, సుడా అడ్వయిజరీ కమిటీ సభ్యులు చీటీ రాజేందర్‌రావు, తోట మధు, ఉదారపు మారుతి, కామారపు శ్యాం, వొ ల్లాల శ్రీనివాస్‌గౌడ్‌ అభినందనలు తెలిపారు. గురుద్వారా ప్రభందక్‌ కమిటీ అధ్యక్షుడు జస్పీర్‌సింగ్‌ ఆధ్వర్యంలో సిక్కు నాయకులు బీదర్‌ నుం చి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందించారు. వీరితో పాటుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అక్బర్‌హుస్సేన్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు అభినందించారు. అలాగే రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బ చ్చు భాస్కర్‌, పద్మశాలీ, గౌడ, నేతకాని, నాయి బ్రాహ్మణ, యాదవ, రజక, మున్నూరుకాపు, టీఎన్‌జీఓ నాయకులు, పెరిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముద్దసాని కనుకయ్య కలిసి అభినందనలు తెలిపారు. కాగా తనను కలిసి జిల్లా అధికారులతో కలిసి వివిధ పనులపై సమీక్షించారు. మహనీయులకు నివాళి.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కరీంనగర్‌కు చేరుకున్న మంత్రి గంగుల కమలాకర్‌ మంగళవారం నగరంలోని అంబేద్కర్‌, జగ్జీవన్‌రాం, జ్యోతి భా పూలే, మహాత్మగాంధీ, ప్రొపెసర్‌ జయశంకర్‌ సర్‌, తెలంగాణ అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి, చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుభాష్‌నగర్‌: గంగుల కమలాకర్‌ను నాయీ బ్రా హ్మణ సేవా సంఘం (500/ 82) రాష్ట్ర అధ్యక్షు డు పాల్వాయి శ్రీను, రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షుడు మోహన్‌ కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సంఘ ఉపాధ్యక్షుడు మహేందర్‌, కార్యదర్శి సుదర్శన్‌, శాస్త్రిపు రం డివిజన్‌ అధ్యక్షుడు భగవాన్‌దాస్‌ ఉన్నారు. తెలంగాణ ప్రైవేట్‌ టీచర్స్‌ వెల్పేర్‌ అసోషియేషన్‌ నేతలు హైదరాబాద్‌లో కలిసి, పుష్ప గుచ్ఛం అం దజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ జిల్లా అధ్యక్షుడు అనుమండ్ల రవీందర్‌రెడ్డి, జిల్లా ప్రధా న కార్యదర్శి తమ్మిడి చందు, ప్రధాన సలహాదారుడు నందెల్లి మహిపాల్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు కేవీఆర్‌ రెడ్డి, మధుకర్‌రెడ్డి, శివప్రసాద్‌, రాజేందర్‌రెడ్డి, మధుకర్‌, నీలకంఠం, చంద్రశేఖర్‌రెడ్డి, కాంతారావు, రవికుమా ర్‌, భూపతి, సంపత్‌రెడ్డి, ఉమేర్‌, జ్యోతి, లావ ణ్య, జలజ ఉన్నారు. కరీంనగర్‌ హెల్త్‌ : మంత్రి శివాలయంలో పూజ చేసిన అనంతరం మంత్రి గంగులకు శ్రీసేవా మా ర్గ్‌ అధ్యక్షురాలు మునిపల్లి ఫణీ త పండ్లు, బట్ట సంచులను అందించి అభినందనలు తెలిపారు. న్యాయవాదుల శుభాకాంక్షలు.. కరీంనగర్‌ లీగల్‌ : కరీంనగర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పీవీ రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో మంత్రి గంగులను స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభా కాంక్షలు తెలిపారు. ప్రధాన కార్యదర్శి లెంకల రా రెడ్డి, కార్యదర్శి కొత్త ప్రకాశ్‌, ఎపీపీ గౌరు రాజిరెడ్డి, న్యాయవాదులు ముల్కల సత్యనారాయణ, కూర శ్రీనివాస్‌రెడ్డి, అజయ్‌ చక్రవర్తి, చక్రధర్‌, పెంచాల శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్‌ ఉన్నారు. అన్నదానం.. సుభాష్‌నగర్‌: మంత్రిగా గంగుల ప్రమాణ స్వీకారం చేయడంపై వ్యక్తం చేస్తూ రేకుర్తి లో గల వృద్ధాశ్రమంలో తెలంగాణ ప్రైవేట్‌ ఉద్యో గుల సంఘం (టీఆర్‌ఎస్‌) ఆధ్వర్యంలో అన్నదా నం చేశారు. జిల్లా అధ్యక్షుడు ముడుంబై కార్తీక్‌, ఉపాధ్యక్షుడు నక్షత్రం శ్రీనివాస్‌, ప్రచార కార్య దర్శి ఏదునూరి సదానందం, నాయకులు శ్రీనివాస్‌, మధు, కిరణ్‌, సంపత్‌ పాల్గొన్నారు.
More