ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

టవర్‌సర్కిల్‌: తొలి తెలంగాణ ఉద్యమంలో వీరనారి చా కలి ఐలమ్మ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి కొ నియాడారు. మంగళవారం జిల్లా కేంద్ర గ్రంథాలయం లో ఐలమ్మ చిత్ర పటానికి ఆయన పూలమాలలు వేసి ని వాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధ్ది పథంలో సాగుతుందన్నారు. తిరుపతినాయక్‌, మధుసూదన్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, సరిత, కిమ్‌ ఫహాద్‌, రవితేజ, రవివర్మ, గంగారెడ్డి, నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు. రజక సంఘం ఆధ్వర్యంలో.. జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో ప్రతిమ మల్టిప్లెక్స్‌ ఎదు ట చిట్యాల ఐల మ్మ (చాకలి ఐలమ్మ) 34వ వర్ధంతిని పురస్కరించుకొని విగ్రహానికి కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ పూలమాలలు వేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా ఆమె తొలి తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్రను ప్రస్తుతించారు. రజక సంఘం నేత లు రమేశ్‌, శంకర్‌, రాజయ్య, కుమార్‌, సంపత్‌, రవీంద ర్‌, శ్రీనివాస్‌, మహేశ్‌, రాము, నాగరాజు పాల్గొన్నారు.
More