ప్రజా భాగస్వామ్యంతోనేపల్లెల ప్రగతి

చొప్పదండి,నమస్తేతెలంగాణ: ప్రజా భాగస్వామ్యంతోనే పల్లెల ప్రగతి సాధ్యమని డీపీవో రఘువరన్‌ పేర్కొన్నారు. మండలంలోని రుక్మాపూర్‌, కొలిమికుంట గ్రామాలను మంగళ వా రం సందర్శించారు. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం అమ లు తీరును పరిశీలించారు. వీధుల్లో కలియదిరిగారు. పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. నాలుగు రోజులుగా చేపట్టిన కార్యక్రమాల వివరాలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ ప్రత్యేక అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ, ఇంటిముందు చెత్త వేయకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన క ల్పించాలన్నారు. ఉల్లంఘిస్తే రూ.500లు జరిమాన విధించాలని సూచించారు. ఇంటింటా విరివిగా మొక్కలు పెంచా లన్నారు. అలాగే గ్రామాల్లో డంపింగ్‌యార్డులు, వైకుంఠదామాలకు స్థలసేకరణ చేపట్టాలని సూచించారు. రాగంపేటలో నిర్వహించిన 30రోజుల ప్రణాళికలో పాలకవర్గసభ్యులతో ఎంపీపీ చిలుకరవి, మండలప్రత్యేకాధికారి శ్రీమాలన వా ర్డుల సందర్శనలో పాల్గొన్నారు. సర్పంచులు తాళ్లపల్లి సు జాత, మామిడి లత, చిలుకలింగయ్య,ఎంపీటీసీలు సింగిరెడ్డికిష్టారెడ్డి, కోటేష్‌, ఎంపీడీఓ స్వాతి, ఈవోపీఆర్‌డీ జగన్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధ్దిలో ఆదర్శంగా నిలపాలి.. గంగాధర: గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేసి ఆదర్శంగా నిలపాలని ఏడీఆర్డీఓ బొజ్జ వెంకటేశ్వర్లు అధికారులు, గ్రామస్తులకు పిలుపునిచ్చారు. మండలంలోని గట్టుభూత్కూర్‌ను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. రానున్న రోజుల్లో చేపట్టబో యే పనులను గురించి సర్పంచ్‌ విజేందర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో.. 30 రోజుల ప్రణాళికలో భాగంగా మండలంలోని మధురానగర్‌, గోపాల్‌రావుపల్లి, గర్శకుర్తి, గట్టుభూత్కూర్‌, గంగాధర, మల్లాపూర్‌, కొండన్నపల్లి గ్రామాల్లో మంగళవారం గ్రామంలో అధికారులు, పాలకవర్గ బాధ్యు లు పాదయాత్ర చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తను రోడ్లపై వేయవద్దని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. లో సర్పంచులు వేముల లావణ్య, రాసూరి మల్లేశం, అలువాల నాగలక్ష్మి, కంకణాల విజేందర్‌రెడ్డి, మడ్లపెల్లి గంగాధర్‌, ఆకుల శంకరయ్య, రేండ్ల జమున ఉపసర్పంచ్‌ పాల్గొన్నారు.
More