గ్రామాల్లో సమస్యల పరిష్కారానికే 30 రోజుల ప్రణాళిక

దండేపల్లి : గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికే 30 రోజుల ప్రణాళికను ప్రభుత్వం చేపట్టిందని ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు, సర్పంచులు పిలుపునిచ్చారు. 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక ప్రణాళికపై సోమవారం దండేపల్లి మండలంలోని 28 గ్రామ పంచాయతీలలో ప్రత్యేకాధికారుల ర్యాలీ తీస్తూ వాడవాడన పర్యటిస్తూ గ్రామాల సమస్యలు తెలుసుకున్నారు. కో-ఆప్షన్ సభ్యులు, స్థాయి సంఘాల సభ్యులు, అధికారులు పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటికో ఇంకుడు గుంత నిర్మించుకోవాలనీ, మొక్కలు నాటాలని అవగాహన కల్పించారు. జన్నారం : మండల కేంద్రంలో అక్కపెల్లిగూడలో పొనకల్ సర్పంచ్ జక్కు భూమేశ్, గ్రామ స్పెషల్ అఫాసర్ అరుణారాణి ఆధ్వర్యంలో కో-ఆప్షన్ సభ్యులు, కమిటీల సభ్యులందరూ ఇంటింటా తిరుగుతూ పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. కలమడుగులో సర్పంచ్ కార్తిక్‌రావు, గ్రామ పెద్ద స్వదేశిరావు,కవ్వాల్‌లో సర్పంచ్ కలిరాం, జన్నారంలో భూసవేని గంగాధర్ ఆధ్యర్యంలో ర్యాలీలు తీసి అవగాహన కల్పించారు. మంచిర్యాల రూరల్ : హాజీపూర్ మండలంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా సోమవారం నంనూర్, చందనాపూర్, ముల్కల్ల, టీకన్నపల్లె, గుడిపేట, నర్సింగాపూర్, దొనబండ, పెద్దగోపాల్‌పూర్ గ్రామాలలో కో-ఆప్షన్ సభ్యులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు, సర్పంచులు, వార్డు సభ్యులు గ్రామాల్లో పర్యటించి ప్రజలను గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వినియోగంలో లేని బావులను, ఇనుప విద్యుత్ స్తంభాలను, బోరుబావులను, అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను, మురుగు కాలువలను గుర్తించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు ప్రజలతో మాట్లాడుతూ గ్రామాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మందపెల్లి స్వర్ణలత, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి, కమిటీ సభ్యులు, సర్పంచులు,కార్యదర్శులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. మొక్కలను నాటించిన అధికారులు.. హాజీపూర్ మండలంలోని ముల్కల్ల గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామ ప్రత్యేకాధికారులు, సర్పంచ్ కమిటీ సభ్యులు సోమవారం ముల్కల్ల గ్రామంలో పర్యటించారు. నివాస ప్రాంతాలలో మొక్క లు లేని చోట ఇంటి యజమానులతో మొక్కలను నాటించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అదికారి ఆర్‌ఐ రాయలింగు, గ్రామ సర్పంచ్ మంచాల శ్రీనివాస్, వార్డు సభ్యులు తదితరులున్నారు.
More