ఆనందం పంచేందుకే పండుగలు

మంచిర్యాల రూరల్: కాళోజీ నారాయణ రావు జీవితం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం లో సోమవారం జయంతి నిర్వహించారు. ఇందు లో భాగంగా కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిదని చెప్పిన కాళోజీ సూచించిన మార్గాన్ని ప్రజలు అనుసరించాలన్నారు. ప్రజల గుండెల్లో నిలిచిన మహోన్నతమైన ప్రజా కవి అన్నారు. నా గొడవతో తన అంతరంగ కవిత్వం ద్వారా ప్రజలకు తెలియజేశారన్నారు. తెలంగాణ యాసను నలు దిశగా వ్యాప్తి చేసేం దుకు విశేషంగా కృషి చేశారనీ, మాతృభాష కన్నతల్లి లాంటిదని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ ప్రజలను తన రచనలతో చైత న్యం వంతం చేసి, తెలంగాణ సాధనలో ముందు కు నడిపించిన వ్యక్తి అన్నారు. తెలంగాణ సాం స్కృతిక సారధి కళాకారులు ఆలపించిన గీతాలు పలువురిని ఆకట్టుకున్నాయి. జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వర్, జిల్లా ఖజానా అధికారిణి సరోజ, జిల్లా పౌర సంబంధాల అధికారి సంపత్ కుమార్, సూపరింటెండెంట్ సదానందం, ఎన్నికల డిప్యూ టీ తహసీల్దార్ శ్రీనివాస్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పంచాయతీ రాజ్ అధికారి వీర బుచ్చయ్య కాళోజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యాలయ పరిపాలనాధికారి సాదిక్ అలీ తో పాటు కార్యాలయం సిబ్బంది ఉన్నారు. జడ్పీ కార్యాలయంలో.. జడ్పీ కార్యాలయంలో పద్మభూషన్ కాళోజీ నారాయణ రావు 105 జయంతిని పురష్కరించుకుని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నల్లాల భాగ్యలక్ష్మి ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ భాష, యాసలోని మా ధుర్యాన్ని ప్రపంచానికి తె లియజేసిన మహాకవి నారాయణ రావు అన్నారు. జిల్లాలోని ప్రజల అందరికి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. జడ్పీ ముఖ్య కార్యనిర్వాహణాధికారి న రేందర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
More