చెన్నూర్‌లో సోలార్ ప్లాంట్

చెన్నూర్ రూరల్: చెన్నూర్ సమీపంలోని శివలింగాపూర్-2 ఇైంక్లెన్ మైన్ సమీపంలో సోలార్ పవర్‌ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు శ్రీరాంపూర్ జీఎం లక్ష్మీనారాయణ అన్నారు. దీనిలో భాగంగా 70 ఎకరాల స్థలాన్ని సోమవారం పరిశీలించినట్లు జీఎం తెలిపారు. జీఎం మాట్లాడుతూ సింగరేణి కంపెనీ లిమిటెడ్ ఒక్క బొగ్గు ఉత్పత్తిలోనే కాకుం డా విద్యుత్ రంగలో కూడా ప్రవేశించి జైపూర్‌లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి దేశంలోనే ప్రము ఖ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. అనంత రం చెన్నూర్ సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. సోలార్ కేంద్రానికి అవసరమయ్యే విద్యుత్‌పై చర్చించారు. సోలార్ కేంద్రం జీఎం రామారావు, ఏరియా ఇంజినీరు రాజశేఖర్ రెడ్డి, ఏరియా సర్వే అధికారి రాఘవేంద్రరావు, సోలార్ పవర్ ప్రాజెక్ట్ కన్సల్‌టెంట్ మురళీధర్, తదితరులు పాల్గొన్నారు.
More