13వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్‌గా సురేశ్

మంచిర్యాల రూరల్: సిరిసిల్లలోని 17వ బెటాలియన్‌లో అస్టింటెంట్ కమాడెంట్‌గా విధులు నిర్వహిస్తున్న యంఐ సురేశ్ ఉద్యోగోన్నతిపై హాజీపూర్ మండలంలోని 13వ ప్రత్యేక తెలంగాణ పోలీస్ బెటాలియన్‌కు అడిషనల్ కమాడెంట్‌గా నియమితులయ్యారు. సురేష్‌ను బెటాలియన్ అధికారులు, సిబ్బంది పుష్పగు చ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంత రం బెటాలియన్‌లో నిర్వహించిన కాళో జీ నారాయణ రావు జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడుడారు. నేను నిన్నటి స్వప్నాన్ని, రేపటి జ్ఞాపకాన్ని-సమాజం లో ఒక పౌరిడిగా బతుకు-పోరగాడిగా కాదు అని గొప్ప సందేశాన్నిచ్చిన మహోన్నతమైన వ్యక్తి కాళోజీ అని కొనియాడారు. తన అక్షర తూటాలతో ప్రజలను చైతన్య పర్చిన తెలంగాణ గాంధీ అని పే ర్కొన్నారు. అసిస్టెంట్ కమాండెంట్ జ యప్రకాశ్ నారాయణ, శ్రీనివాస్ రావు, ఆర్‌ఐలు ఆర్పీ సింగ్, చౌహాన్ ఆర్‌ఎస్‌ఐలు శ్రీధర్, ప్రేమ్ కుమార్, నారాయణ రెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు.
More