ప్రగతి సైన్యం

-స్టాండింగ్‌ కమిటీల ఏర్పాటు. కో-ఆప్షన్‌ సభ్యుల ఎంపిక -మూడో రోజూ జోరుగా కొనసాగిన 30 రోజుల ప్రణాళిక -ప్రణాళిక కార్యాచరణకు స్పందన.. పల్లెల్లో పండుగ వాతావరణం -విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్న దాతలు మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ సర్కారు పల్లెల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నది. 30 రోజుల ప్రణాళికలో భాగంగా మూడో రోజు సభలు ఉధృతంగా సాగాయి. గ్రామసభలు, అధికారుల పర్యటనలు, కమిటీల సమావేశాలతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. నెల రోజుల ప్రణాళిక వివరాలను జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) వీర బుచ్చయ్య రూపొందించి అమలు చేస్తున్నారు. మొదటి రోజు నిర్వహించిన గ్రామ సభల్లో సీఎం కేసీఆర్‌ ప్రసంగ పాఠాన్ని అధికారులు చదివి వినిపించారు. రెండో రోజు కో-ఆప్షన్లు, స్టాండింగ్‌ కమిటీలను ఎన్నుకున్నారు. అధికారులు వారికి కేటాయించిన గ్రామాలకు ఉదయమే వెళ్లి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నా రు. వార్డు సభ్యులు, సర్పంచులు, జడ్పీటీసీలు, ఎం పీటీసీలు, విశ్రాంత ఉద్యోగులు, యువత, స్వశక్తి సంఘాల మహిళలు ప్రతి వార్డును తిరుగుతూ సమస్యలను గుర్తిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక, కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నాటిన మొక్కలు సంరక్షించడం, హరిత హారం వంటి కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు. 918 కో-ఆప్షన్‌.. 18,660 మంది సభ్యులు.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముప్పై రోజుల ప్రణాళికలో రెండో రోజైన శనివారం ప్రతి గ్రామం లో కో-ఆప్షన్‌ సభ్యులను, స్టాండింగ్‌ కమిటీలను ఎన్నుకున్నారు. ఒక్కో పంచాయతీలో 15 మంది చొప్పున 60 మంది సభ్యులతో నాలుగు కమిటీలు వేశారు. ఇలా జిల్లాలోని 18 మండలాల్లో 311 గ్రా మ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 918 మం ది కో-ఆప్షన్‌ సభ్యులు, 18,660 మంది సభ్యుల ను ఎన్నుకున్నారు. ఇందులో స్వశక్తి సంఘాల మ హిళలు, యువతీ, యువకులు, విశ్రాంత ఉద్యోగు లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వార్డు సభ్యుల ను కమిటీలలో సభ్యులుగా చేర్చారు. కమిటీ రెండు రోజులపాటు గ్రామంలో విస్తృతంగా పర్యటించి, దీర్ఘకాలిక సమస్యలు, మురికి కాలువలు, శిథిలావస్థలో ఉన్న ఇండ్లు, మంచినీరు, పారిశుధ్యం, రోడ్లు, మొక్కలు ఎక్కడ నాటాలి, ప్రమాదకర బావులు, శ్మశాన వాటికలు, ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు ఇ లా నాలుగు రకాల కమిటీలు సర్వే నిర్వహిస్తారు. 2 రోజుల్లో సర్వే నిర్వహించి, మూడో రోజు పూర్తి నివేదికలను పంచాయతీ అధికారికి అందజేస్తారు. రెట్టింపు ఉత్సాహం ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో భాగస్వాములవుతున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడంతోపాటు హరితహారం మొక్కలు నాటే స్థలాలను పరిశీలిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తిస్తున్నారు. ముఖ్యంగా పల్లెల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా కమిటీ సభ్యులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. విషజ్వరాలు, డెంగీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. స్వచ్ఛంద శ్రమదానంతో పిచ్చిమొక్కలు తొలగిస్తున్నారు. మూడు రోజులుగా కార్యక్రమాలు గ్రామాల్లో ఊపందుకున్నాయి. గ్రా మాభివృద్ధికి ఆ గ్రామ ప్రజలే పాటుపడాలని, సర్కా రు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. తమ పల్లెను మోడల్‌ విలేజీగా తీర్చిదిద్దుకోవాలన్న ఆకాంక్షతో ప్రతి ఒక్కరు కదిలి వచ్చి కార్యక్రమాలలో పాల్గొనడం విశేషం. అభివృద్ధికి నిధులు పల్లెల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది. 14వ ఆర్థిక సంఘం నిధులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నిధులు ముందుస్తుగానే జిల్లాలకు విడుదల చేసింది. గ్రామ అభివృద్ధికి ఏమి కావాలో కమిటీలు నిర్ణయించిన మేరకు విడుదలైన నిధులను పంచాయతీలకు కేటాయిస్తారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల వివరాలను మరో రెండు రోజుల్లో కమిటీ పంచాయతీ అధికారులకు నివేదికలు ఇవ్వనున్నది. నివేదికల ఆధారంగా గ్రామాల్లో పనులు చేపట్టనున్నారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలను కలెక్టర్‌ భారతి, పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య పర్యవేక్షిస్తున్నారు. 30 రోజుల ప్రణాళికను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో 30 రోజుల ప్రణాళికలు విజయవంతం చేయాలని ఇప్పటికే కింది స్థాయి అధికారులను హెచ్చరించారు. అదే సమయంలో అనుమానాలు, సమస్యలు ఉంటే తమను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ముందుకు వస్తున్న దాతలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా అమలు చేస్తున్న 30 రోజల ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రజలు పట్టదలతో పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న నిధులతోపాటు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, ముక్తి దామాలు, బస్‌షెల్టర్లు, డంపింగ్‌యార్డులు, మంచినీటి ట్యాంకుల నిర్మాణాలు ఇలా వివిధ అభివృద్ధి పనుల కోసం తమ వంతు సాయంగా ధన రూపేణ ఇచ్చే దాతలు కూడా ముందుకు వస్తున్నారు. అధికారులు వేసిన ప్రణాళిక అమలు కమిటీలు దాతల వివరాలు సేకరిస్తున్నారు. విదేశాలలో ఉన్న వారి దాతల పేర్లు సేకరించి వారికి గ్రామ అభివృద్ధిపై వివరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చేందుకు దాతలు సానుకూలంగా స్పందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
More