విప్‌ సుమన్‌కు శుభాకాంక్షలు

-హైదరాబాద్‌లో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చిన నాయకులు మందమర్రి: ప్రభుత్వ విప్‌గా నియమితులైన చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్‌ శుభాకాంక్షలు తెలిపారు. సమాచారం అందగానే ఆదివారం బండి సదానందం యాదవ్‌ తన అనుచరులతో కలసి హైదరాబాద్‌కు తరలివెళ్లారు. అక్కడ తెలంగాణ భవన్‌లో విప్‌ సుమన్‌ను కలసి ముందుగా శాలువాతో సన్మానించారు. అనంతరం పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ సుమన్‌ను విప్‌గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దకాలంగా వెనుక బాటుకు గురైన చెన్నూర్‌ నియోజకవర్గాన్ని ఎలాగైన అభివృద్ధి చేయాలనే పట్టుదలతో ఎమ్మెల్యే కృషి చేస్తున్నారన్నారు. ఎన్నికైన నాటి నుంచి సమస్యలను ఎప్పటికప్పుడు స్థానిక నాయకుల ద్వా రా తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులతో చర్చిస్తూ వివిధ పథకాల కింద కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేయిస్తూ అభివృద్ధికి చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, కోటపల్లి మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు వాలా శ్రీనివాసరావు, ఆర్‌ఎస్‌ నాయకులున్నారు.
More