ఇష్టంగా చదువుకోవాలి

-కలెక్టర్‌ భారతి హోళికేరి - జన్నారంలో అక్షరాస్యత ర్యాలీ ప్రారంభం - వయోజనులతో అక్షరాలు దిద్దించిన కలెక్టర్‌ జన్నారం: నిరక్షరాస్యులు కష్టంగా ఉన్నా ఇష్టంతో చదువు నేర్చుకోవాలని కలెక్టర్‌ భారతి హోళికేరి సూచిం చారు. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో విద్యార్థులు, అధికారులు చేపట్టిన ర్యాలీని కలెక్టర్‌ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాన ర హదారి మీదుగా ప్రభుత్వ బాలుర పాఠశాల వరకు రాలీగా వెళ్లారు. పాఠశాలలో వయోజన విద్య అమ్మానాన్నలకు చదువుపై ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడారు. 100 రోజుల్లో 100 శాతం అక్షరాస్యత సాధించేందుకు ప్రస్తుతం పాఠశాలల్లో ఆరో తరగతి నుం చి ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లలు అమ్మా, నాన్నలకు చదువునేర్పాలాన్నారు. ప్రతి ఒక్కరూ చదువు కోవాలని అనుకుం టే తప్పకుండా చదవడం రాయడం వస్తుందన్నారు. నిరక్షరాసులను అక్షరాసులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి అందరూ చదవుకునేల చూడాలన్నారు. అక్కడకు వచ్చిన నిరక్షరాసులైన మహిళలకు అక్షరాభ్యాసం చేసి వారిచేత అక్షరాలను దిద్దించారు. అనంతరం పా ఠశాల అవరణలో హరితహారం మొక్క ను నాటి నీరును పోశారు. వయోజన విద్య జిల్లా అధికారి పురుషోత్తంనాయక్‌, ఎస్‌వో సర్ధార్‌ అలీఖాన్‌, ఎంఇవో నడిమెట్ల విజయ్‌కుమార్‌, ఎంపీడీఓ అరుణారాణి, జెడ్‌పీటీసీ ఎర్ర చం ద్రశేఖర్‌, ఎంపీపీ మాదాడి సరోజన, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అద్యక్షడు గుర్రం రాజారాంరెడ్డి, వైస్‌ ఎంపీపీ సుతారి వినయ్‌కుమార్‌,సర్పంచ్‌ జక్కు భూమేశ్‌, కోఅప్షన్‌ సభ్యు డు మున్వర్‌ అలీఖాన్‌,ఎంపీటీసీ సభ్యురాలు గుండవర పు హరణి,ఎన్‌సీసీ అధికారి కట్ట రాజమౌళి,జాడి మురళి, హెచ్‌ఎం కొండు జనార్దన్‌, చెందులాల్‌ పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ వార్డు గ్రహీత సుందిల్ల రమేశ్‌ను మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో కలెక్టర్‌ భారతి హోళికేరి శాలువాతో సన్మానించారు. రమేశ్‌ ఎర్రకుంటపల్లె పాఠశాలలో పనిచేస్తున్నారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు నాణ్యమైన విద్యా అందించే వారిని ప్రభుత్వం అవార్డులను అందించడం జరిగిందని అ వార్డు గ్రహీత తెలిపారు. వయోజన విద్యా జిల్లా అదికారి పురుషోత్తంనాయక్‌, ఎస్‌ఓ సర్దార్‌ అలీఖాన్‌, ఎంఈవో నడిమెట్ల విజయ్‌కుమార్‌, జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్‌, ఎంపీపీ సరోజన పాల్గొన్నారు..
More