‘గ్రామ ప్రణాళిక’తో పల్లెలు మెరవాలి

-జడ్పీ అధ్యక్షురాలు నల్లాల భాగ్యలక్ష్మి -అందుగుల పేటలో పర్యటన మందమర్రి రూరల్‌ : సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా చేపట్టిన 30 రోజుల గ్రా ప్రణాళిక కార్యక్రమంలో పల్లెలన్నీ మెరవాలని జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు నల్లాల భాగ్య లక్ష్మి అన్నారు. 30 రోజుల గ్రామ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆమె ఆదివారం మండలంలోని అందుగులపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. దేశ ప్రగతికి పల్లెలె ప్రధానమని చెప్పారు. ముఖ్య మంత్రి కేసీఆర్‌ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చేందుకు 30 రోజుల గ్రామ ప్రణాళిక కార్యక్రమానికి రూప కల్పన చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగ స్వాము లు కావాలన్నారు. రోడ్లు, మురికి కాల్వలు, వీధి దీపాలు, తాగు నీటి సమస్యలపై ఆమె చర్చించారు. మురగునీటి కాల్వలను అప్పటి కప్పుడే శుభ్రం చేయించారు. హరిత హారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. గ్రామంలోని వార్డుల్లో స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి పర్యటించారు. గ్రామానికి మొదటి సారిగా వచ్చిన జడ్పీ అధ్యక్షరాలిని సర్పంచ్‌ ఏనుగు తిరుపతి రెడ్డి సన్మానించారు. అంతకు ముందుగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
More