చికిత్స పొందుతూ ఒకరి మృతి

మంచిర్యాల స్పోర్ట్స్‌ : మంచిర్యాల పట్టణంలోని తోళ్లవాగు ఏరియాలో నివసించే వడ్లకొండ(కరాటే) ప్రభాకర్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడగా, హైదరాబాద్‌లో చికిత్స పొందు తూ మృతి చెందాడు. ప్రభాకర్‌ మృతి చెందినట్లు కుటంబ సభ్యులు ఆదివారం సాయం త్రం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గత నెల 25న రాత్రి 10: 30గంటల సమయంలో మంచిర్యాలలో స్కూటీపై వెళ్తుండగా బైక్‌ ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి.మంచిర్యాలో చికిత్స అందించిన తరువాత కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని కేర్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 10: 30 గంటలకు బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ప్రభాకర్‌ రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా కలెక్టర్‌ క్యాంప్‌ కార్యలయంలో విధులు నిర్వహిస్తుండేవాడు. కరాటే ప్రభాకర్‌గా గుర్తింపు పొందాడు. కరాటే మాస్టర్‌గా సుమారుగా 35మందిని తయారు చేశారు. కరాటే పోటీల్లో పలుపతకాలు సాధిం చాడు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈయ న శిష్యులతో ఉచితంగా కరాటే శిక్షణ ఇప్పించాడు.ప్రభాకర్‌ చనిపోయినా ఆయన అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
More