పకడ్బందీగా నిమజ్జన ఏర్పాట్లు

-ఏసీపీ బాలు గౌస్‌బాబా -గోదావరి పరిసరాల పరిశీలన దండేపల్లి: గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల ఏసీపీ గౌస్‌బాబా సూచించారు. గూడెం గోదావరి వద్ద ఆది వారం నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించారు. గణేశ్‌ నిమజ్జనానికి పక్క జిల్లాల నుంచి కూడా భారీగా వినాయకులు వచ్చే అవకాశం ఉన్నందున, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుం డా అప్రమత్తంగా ఉండాలన్నారు. గోదావరి తీరం ఎలా అనువుగా ఉంటుందో తెలుసుకున్నారు. నీ టి ప్రవాహం, వినాయక విగ్రహాల సంఖ్య, నది లో నీరు ఎటువైపు ఎక్కువగా ప్రవహిస్తుంది, ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డు వరకు దూరం ఎంత అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. లక్షెట్టిపేట సీఐ నారాయణ్‌నాయక్‌, ఎస్‌ఐలు మధుసుదన్‌, విజయ్‌కుమార్‌, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, మాజీ వైస్‌ ఎంపీపీ ఆకుల రాజేందర్‌, ఎంపీటీసీ ముత్తె రాజన్న, టీఆర్‌ఎస్‌ నాయకులు బండారి మల్లేశ్‌, ఇప్ప రమేశ్‌, పోలీసు అధికారులున్నారు.
More